చలో ఆకివీడుకు అందరూ సహకరించాలి బి ఎస్ పి

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఆకివీడులో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, దళితులు, దళిత క్రైస్తవులు, ముస్లిం సమాజంపై దాడులకు నిరసనగా, అలాగే ఆకివీడులో గొంతాలమ్మ గుడి నిర్మించాలని డిమాండ్ చేస్తూ మే 3వ తేదీన బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 'చలో ఆకివీడు' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బాపట్ల పార్లమెంటు బీఎస్పీ ఇన్చార్జ్ డాక్టర్ గుదే రాజారావు తెలిపారు. బుధవారం బాపట్ల పట్టణంలో ఆయన చలో ఆకివీడు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్