డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదల వరకు పోరాటం: కోన రఘుపతి

డీఎస్సీ మెరిట్ లిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని, అప్పటి వరకు వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతాయని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. సోమవారం బాపట్లలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టి, అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. మెరిట్ లిస్ట్ ప్రకటించడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కొందరికి అనుకూలంగా ఫలితాలు ఉండేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విమర్శించారు. పారదర్శకత కోసం పూర్తి వివరాలను వెల్లడించాలని కోరారు.

సంబంధిత పోస్ట్