మాజీమంత్రి గాదే వెంకటరెడ్డి మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, బాపట్ల మాజీ శాసనసభ్యులు గాదె వెంకటరెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గాదె వెంకటరెడ్డి ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం పాటు సేవలందించి, మంత్రిగా, శాసనసభ్యుడిగా బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారని ఆయన కొనియాడారు.

సంబంధిత పోస్ట్