కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నాలుగు కొత్త పథకాలు

భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రవేశపెట్టిందని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం  తెలిపారు. బాల కార్మిక నిర్మూలన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వివాహ ప్రోత్సాహకంగా రూ.20 వేలు, సాధారణ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియల ఖర్చులకు రూ.20 వేలు, మహిళా కార్మికులకు రెండు కాన్పుల వరకు రూ.40 వేలు అందజేస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్