రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్లో పోలీస్ రాజ్యాంగం నడుస్తుందని వైఎస్ఆర్సిపి రాష్ట్ర కోఆర్డినేటర్ రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరులో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ప్రభుత్వ పెద్దలకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నాగేశ్వరరావు పై హత్యాయత్నం చేశారన్నారు. నెల్లూరులో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడిని పట్టించుకోలేదన్నారు.