ఇంకొల్లు: పిచ్చికుక్కల దాడి.. 10 మందికి గాయాలు

ఇంకొల్లు పట్టణంలో పిచ్చికుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం వీధుల్లో తిరుగుతున్న పిచ్చికుక్కలు ఒకేసారి పలువురిపై దాడి చేసి సుమారు 10 మందిని గాయపరిచాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరికి తీవ్ర గాయాలవడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్క కాటుతో రేబిస్ ప్రమాదం ఉన్నందున వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్