బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో మిస్సింగ్ కేసులపై పోలీసులు దృష్టి సారించారు. ఇటీవల గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించిన నేపథ్యంలో, ఎస్సై రవీంద్ర పాత కేసులను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో, సుమారు రెండేళ్ల క్రితం నర్రావారిపాలెం గ్రామానికి చెందిన గల్లంతైన మహిళను గుర్తించి, బుధవారం కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా కులాంతర వివాహాలు చేసుకున్న యువతుల వివరాలను కూడా తెలుసుకుని, వారు సురక్షితంగా ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలని ఎస్సై సూచించారు.