బాపట్లలోని శ్రీమత్సుందరవల్లీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి ఆలయంలో 1433వ నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల మే 8వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ అధికారులు విడుదల చేశారు. మే 1వ తేదీన శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం జరగనుంది.