బాపట్ల పట్టణంలోని ప్యాడిసన్ పేటలో రూ. 1.20 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం గృహ నిర్మాణ శాఖ, బాపట్ల జిల్లా ఇంచార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ, ఆర్. డి. ఓ గ్లోరియా తదితరులు పాల్గొన్నారు.