బాపట్ల మండలం పాండురంగాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ముఖ్య అతిథిగా హాజరై, పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలియో రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని, ఐదేళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.