బాపట్ల నియోజకవర్గం పరిధిలోని కర్లపాలెం, రాంబోట్ల వారి పాలెం గ్రామం, పట్టణ పరిధిలోని టీచర్స్ కాలనీలో శుక్రవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. అన్న ఎన్టీఆర్ పేరు మీద చంద్రబాబు అర్హులైన లబ్ధిదారులకు గత ప్రభుత్వము కన్నా మిన్నగా నగదు పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ కూటమి నాయకులతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.