బాపట్ల పట్టణంలోని గడియార స్తంభం సెంటర్‌లో గురువారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ గోనుగుంట కోటేశ్వరరావు, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.