మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేయండి ఎమ్మెల్యే

గుంటూరు మిర్చి యార్డ్ డైరెక్టర్‌గా నియమితులైన డొక్కుమళ్ళ భాగ్యరావును గురువారం ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. రైతు సమస్యల పరిష్కారానికి, మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్