అమృత్ భారత్ స్టేషన్ స్కీం పనులను వేగవంతం చేయాలి: ఎంపీ

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' కింద బాపట్ల రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులతో కలిసి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తి చేసి బాపట్ల ప్రజలకు, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్