బాపట్ల జిల్లా, బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగిపోయాయి. విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది విద్యుత్ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో చోటుచేసుకోవడం గమనార్హం. ఇలాంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన బాపట్ల, అద్దంకి ప్రాంతాల్లో చర్చనీయాంశమైంది.