నిజాంపట్నం: షార్ట్ సర్క్యూట్‌తో బోటు దగ్ధం

శనివారం ఉదయం నిజాంపట్నం హార్బర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో సున్నంపూడి గోవింద రాజుకు చెందిన బోటు దగ్ధమైంది. వేటకు బయలుదేరే సమయంలో ఇంజిన్ ఆన్ చేయగానే మంటలు చెలరేగాయి. ఫిషరీస్ డైరెక్టర్ రామకృష్ణ, ఎంపీపీ విజయ నిర్మల, హరనాథ్ బాబు, మత్స్యకార నాయకుడు శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

సంబంధిత పోస్ట్