ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం బాపట్ల మండలం మరుప్రోలువారి పాలెం గ్రామంలో ఉత్సాహంగా జరిగింది. ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ నగదును అందజేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.