బాపట్ల జిల్లా, చీరాల రూరల్, దేవాంగపురి పంచాయితీ పరిధిలోనీ చీరాల మండల అభివృధి అధికారి బి. శివన్నారాయణ, టిడిపి నాయకులు సిద్ధి బుచ్చేశ్వరరావు ఆధ్వర్యంలో దేవాంగపురి గ్రామ వాసులకు పెన్షన్ పంపిణి శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్యఅతిథిలుగా చీరాల ఎమ్మెల్యే శ్రీ మద్దులూరు మాలకొండయ్య, యువ నాయకులు మద్దూలూరి అమర్నాథ్ పాల్గొన్నారు.