గురువారం రాత్రి బాపట్ల మండలం బేతపూడి గ్రామపంచాయతీ పరిధిలో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల అనేక పేద రైతు కూలీల సిమెంట్ రేకుల ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బలమైన గాలులకు రేకులు ఎగిరిపోవడంతో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన ఈ రైతు కూలీలు ప్రకృతి విపత్తుతో మరింత కష్టాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు సహాయం అందించాలని బాధితులు కోరుతున్నారు.