పెట్రోల్ డీజిల్ కొరతను నివారించాలి ఏబీపీ పర్రె కోటయ్య

రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూడాలని జై భీమ్ భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ పర్రె కోటయ్య ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, బాపట్ల జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉందని, చాలా పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయని తెలిపారు. అధికారులు, నాయకులు రాష్ట్రంలో కొరత లేదని చెబుతున్నా, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్