28న జిల్లాలో పల్స్ పోలియో డ్రైవ్

బాపట్ల జిల్లాలో ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. అనంతరం 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి 100 శాతం లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ ఆదేశించారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్