బాపట్లలో కురుస్తున్న వాన

బాపట్ల జిల్లాలో బుధవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారి పలుచోట్ల వర్షం కురిసింది. పర్చూరు నియోజకవర్గం పరిధిలో తేలికపాటి జల్లులు, బల్లికురవ, అద్దంకి ప్రాంతాల్లోనూ చిరుజల్లులు ప్రజలను తడిపాయి. గత నాలుగు రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. అయితే, ఉదయాన్నే పనులకు బయలుదేరిన వారు వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్