రాజుపాలెం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయుడి మృతి

మార్టూరు మండలం రాజుపాలెం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయుడు బండి నిరంజన్ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఈ వార్తతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మండల విద్యాశాఖ అధికారి MCH. వస్రామ్ నాయక్ ఉపాధ్యాయుడి మృతదేహాన్ని సందర్శించి, పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో CRP రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్