అంత్యోదయ కార్డుదారులకు రేషన్.. పంపిణీని పరిశీలించిన ఆర్డీఓ

బాపట్ల పట్టణంలోని బేతని కాలనీలో మంగళవారం అంత్యోదయ రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులను ఆర్డీఓ హరికుమార్ పంపిణీ చేశారు. రేషన్ పంపిణీ ప్రక్రియను పరిశీలించిన ఆయన, లబ్ధిదారులకు సకాలంలో సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంత్యోదయ కార్డుదారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సలీమా, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఫణికుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్