రోటరీ క్లబ్ మార్టూరు: చెప్పులు కుట్టేవారికి, తోపుడు బండ్ల వ్యాపారులకు గొడుగుల పంపిణీ

ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్డుపై చెప్పులు కుట్టుకునే కార్మికులకు, తోపుడు బండ్లపై వ్యాపారం చేసే చిరు వ్యాపారులకు బాపట్ల జిల్లా మార్టూరులో రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు ఆధ్వర్యంలో గొడుగులను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మాదాల సాంబశివరావు, చెరుకూరి నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షులు మధ్దుమాల కోటేశ్వరరావు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ పంపిణీ ద్వారా నిత్యం ఎండ, వానల మధ్య పనిచేసే వారికి కొంత ఉపశమనం లభించింది.

సంబంధిత పోస్ట్