విద్యార్థుల రక్షణకు శక్తి యాప్: సీఐ మాదినేని శేషగిరిరావు

బాపట్ల సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో స్థానిక హర్షిణి కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్టూరు సీఐ మాదినేని శేషగిరిరావు మాట్లాడుతూ, విద్యార్థుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్ పట్ల పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సైబర్ క్రైమ్, ఫోక్సో చట్టం, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించారు. ప్రతి విద్యార్థి తమ మొబైల్ లో గాని, తల్లిదండ్రుల మొబైల్ లో గాని శక్తి యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలని, ప్రమాదాలు ఎదురైనప్పుడు యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందిస్తే సత్వరమే స్పందిస్తారని శక్తి టీం సిబ్బంది శ్రీనివాసరావు, రేవతి తెలిపారు. ఈ కార్యక్రమం బుధవారం జరిగింది.

సంబంధిత పోస్ట్