ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి: బూర్ల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో, ప్రత్తిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఆదేశాల మేరకు గురువారం వింజనంపాడులోని కె. కె. ఆర్ & కె. ఎస్. ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , సైన్స్ కళాశాల(కిట్స్) ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడింది. జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి కే. సంజీవరావు మాట్లాడుతూ 36 కంపెనీలు పాల్గొని సుమారు 1100 ఉద్యోగావకాశాలు కల్పించాయని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్