అంకితభావంతో విధులు నిర్వహించే పోలీస్ అధికారులు పదవీ విరమణ పొందడం శాఖకు ఒక లోటని ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. శనివారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ జి రామాంజనేయులు, ఏ ఆర్ డి ఎస్ పి పి విజయసారథి, ఏఎస్ఐ సత్యనారాయణమూర్తి పదవీ విరమణ సన్మాన సభలో మాట్లాడారు. ముగ్గురు అధికారులకు పూలమాలలు వేసి సత్కరించారు. ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ కుటుంబంతో ఆహ్లాదకరంగా గడపాలని ఎస్పి సూచించారు. పలువురు పోలీస్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.