తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసులు దొంగిలిస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. గత శనివారం అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి అపహరించిన బంగారు వస్తువులను రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు.