పార్టీ బలోపేతానికి సమన్వయంతో కృషి చేయాలి వడ్రాణం

పొన్నూరు మండలం ఆలూరు గ్రామంలో జనసేన పార్టీ గ్రామ సభ ఆదివారం జరిగింది. కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రాణం మార్కండేయ బాబు పాల్గొన్నారు. గ్రామ సమస్యలను ఎమ్మెల్యే నరేంద్ర దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార మయ్యేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామంలో జనసేన పార్టీ బలోపేతానికి కూటమి శ్రేణులతో కలిసి పని చేయాలన్నారు. జనసేన జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లూరి అప్పారావు, దేశంశెట్టి సూర్య, ఆలూరి గ్రామ అధ్యక్షుడు కాట్రగడ్డ వెంకట్రావు, పొన్నూరు పట్టణ, మండల నాయకుల చేబ్రోలు పున్నారావు, ఆకుల గోపి, కట్ట నాగరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్