బాపట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో జనసేన పార్టీ నాయకుడు విన్నకోట సురేష్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థినులకు స్టేషనరీ సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా హాస్టల్‌లో నివసిస్తున్న బాలికలకు ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు, స్కేలు వంటి విద్యా సామగ్రిని అందజేశారు. విద్యార్థినులు ఆనందంతో సామగ్రిని స్వీకరించగా, హాస్టల్ ప్రాంగణం ఉత్సాహభరిత వాతావరణంతో కళకళలాడింది. ఈ సందర్భంగా విన్నకోట సురేష్ మాట్లాడుతూ, జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే స్పష్టమైన లక్ష్యంతో ఇష్టంగా చదవాలని, బాలికా విద్యాభివృద్ధికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.