బాపట్ల జిల్లా, పర్చూరు మండలం అద్దంకి నాంచారమ్మ దేవస్థానం ఆవరణలో శనివారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి పాల్గొన్నారు. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొంది, ఆరోగ్యంగా ఉండాలంటే యోగాతోనే సాధ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలతో పాటు అధికారులు కూడా వివిధ యోగాసనాలు వేసి స్ఫూర్తినిచ్చారు. త్రికోణ ఆసనం, భద్రాసనం, వజ్రాసనం వంటి అనేక ఆసనాలు ప్రదర్శించారు.