యద్దనపూడి మండలంలోని అనంతవరం గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుంచాల వీరకుమారి (27) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వీరకుమారి కొంతకాలంగా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఆమెకు మరో వివాహం చేయాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు సంబంధాలు పరిశీలిస్తుండగా, ఈ విషయమై మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసినట్లు యద్దనపూడి ఎస్ఐ రత్నకుమారి తెలిపారు.