పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ఆంధ్రప్రదేశ్ పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అదనపు సంచాలకులు డా. రజినీ కుమారి తెలిపారు. ఎడ్లపాడులో గురువారం మాట్లాడుతూ, ఈ శిబిరాలు పాడి పరిశ్రమ అభివృద్ధికి, పశుపోషకుల ఆర్థికాభివృద్ధికి కీలకమని, సకాలంలో టీకాలు, సరైన పోషణతో ఇది సాధ్యమవుతుందని ఆమె సూచించారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్