బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడికి రిమాండ్

గణపవరం గ్రామంలో బాలికపై అత్యాచారానికి యత్నించిన ఘటనలో ఒడిశాకు చెందిన కార్మికుడు ప్రసాద్ దాస్ పంతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్