పిడుగుపాటుతో గేదె మృతి – రైతు కుటుంబంలో విషాదం

ఎడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామంలో ఈరోజు సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో పిడుగుపాటు సంభవించింది. అకాల వర్షం కురుస్తున్న వేళ పిడుగు పడటంతో పశువులే జీవనాధారంగా బతుకుతున్న ఓ రైతుకు చెందిన గేదె అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లముందే జీవనాధారమైన పశువు మృతిచెందడంతో రైతు తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్