పల్నాడు జిల్లా యడ్లపాడు జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపురం సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జగదీష్ (75), ఆయన మనవరాలు జగదీశ్వరి (8) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.