పల్నాడు జిల్లా చిలకలూరిపేట ముఖ్యమంత్రి సహాయ నిధి (సీ. ఎమ్. ఆర్. ఎఫ్) సాయం లక్షలాది పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతోందని, ప్రాణాంతక వ్యాధులతో బాధపడేవారికి నాణ్యమైన వైద్యసేవలు అందిస్తోందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. శుక్రవారం ఆయన తన నివాసంలో పలువురు లబ్ధిదారులకు సీఎం. ఆర్. ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.