చిలకలూరిపేట: ఆర్టీసీ సమస్యలపై ఫిర్యాదు స్వీకరణ

చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్లో డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని శుక్రవారం డీఎం రాంబాబు చేపట్టారు. ఈ సందర్భంగా నాదెండ్ల మండలం అవిశాయిపాలెం- ఇర్లపాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం దగ్గర ఆర్టీసీ బస్సుకు స్టాప్ పెట్టాలని ఫిర్యాదు వచ్చిందన్నారు. బస్సు స్టాప్ పెట్టే విషయంపై పరిశీలిస్తామన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ఆర్టీసీ సమస్యలు ఉంటే డీఎం 9959225427 దృష్టికి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్