చిలకలూరిపేట పట్టణంలోని ఆర్. వీ. ఎస్. సీ. వీ. ఎస్ హైస్కూల్ ప్రాంగణంలో శుక్రవారం రూ. 50 లక్షల ఎంపీ నిధులతో నిర్మించ తలపెట్టిన మూడు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు పాఠశాలలోని ఇతర తరగతి గదులను పరిశీలించారు.