ప్రభుత్వం కట్టించిన ఇళ్లల్లో నివాసము ఉండకుండా వాటిని నిరుపయోగంగా ఉంచడం మంచిది కాదని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం చిలకలూరిపేటలో 20, 22 వార్డులలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇళ్ళు పొందిన వారు వీలైనంత త్వరగా గృహప్రవేశాలు చేయాలన్నారు. తాగునీటి సమస్య పరిష్కరించామని ఇంకా ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలు ఉంటే త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.