ప్రముఖ పారిశ్రామికవేత్త గట్టా హేమ కుమార్ బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలోని రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఆయనకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిలకలూరిపేటలోనే కాక, రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని మాధవ్ ఆయనకు సూచించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మాధవ్, జాతీయ అధ్యక్షుడు నడ్డాకి హేమ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.