మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణవార్త వినగానే జిల్లాలో ఆయన అభిమానులు, నాటక కళాకారులు శోకంలో మునిగిపోయారు. ఆయనకు చిలకలూరిపేట, నరసరావుపేటలతో మంచి అనుబంధం ఉంది. యడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన కరణం రాజేశ్వరరావు కుమార్తె రుక్మిణిని 1968లో వివాహం చేసుకున్నారు. అప్పట్లో యువ కళాకారులకు సానుభూతి చూపుతూ సలహాలు ఇచ్చేవారు.