రైతులకు అన్నదాతా సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సుప్రయాణం హామీల అమలుతో కూటమిప్రభుత్వ ప్రజారంజక పాలనలో నూతన శకం మొదలైందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా నెరవేర్చడంలో చంద్రబాబు దేశానికే ఆదర్శంగా నిలిచారన్న ప్రత్తిపాటి. వైసీపీ ప్రభుత్వంలా అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసగించలేదన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా ప్రత్తిపాటి గురువారం పట్టణంలోని 33 వార్డులో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.