పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ఇస్సపాలెం గ్రామంలో గురువారం 'అక్షర ఆంధ్ర - అక్షర పల్నాడు' కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ కృత్తిక శుక్లా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదువుకోవాలని, ముఖ్యంగా మహిళల విద్య కుటుంబానికి, సమాజానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. వయోజనుల విద్య కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో టీవీ కృష్ణకుమారి, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి, వయోజన విద్యాశాఖ సూపర్ వైజర్ శ్రీ రవి, ఏపీఎం శ్రీ భరత్ కుమార్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.