చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వసతులు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నామని సివిల్ సర్జన్ డా. భవాని ఆదివారం తెలిపారు. సుమారు రూ. 18.54 కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రిని 100 పడకల సదుపాయాలతో అభివృద్ధి చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యాధునిక ఎల్డీఆర్ లేబర్ గది, సరికొత్త ఆపరేషన్ థియేటర్లు, అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న ఈ సౌకర్యాలను వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్