మద్యం మత్తులో కారు బీభత్సం.. హోటల్‌లోకి దూసుకెళ్లిన వాహనం

చిలకలూరిపేటలో గురువారం ఉదయం మద్యం మత్తులో ఉన్న యువకులు ప్రయాణిస్తున్న కారు బీభత్సం సృష్టించింది. నియంత్రణ కోల్పోయిన కారు బ్యాంక్ ఆఫ్ బరోడా సమీపంలోని ఓ హోటల్ వైపు దూసుకెళ్లి ముందుగా ఏర్పాటు చేసిన ఇనుప కటౌట్‌ను బలంగా ఢీకొట్టింది. ఉదయం కావడంతో జనసంచారం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్