చిలకలూరిపేటలో ఆదివారం సాయత్రం ఈదురు గాలులతో వర్షం దంచి కొట్టింది. ఉదయం నుంచి వేడిమి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని ఎన్నార్టీ, గడియారస్తంభం, కళామందిర్, అడ్డరోడ్డు సెంటర్లలో ఉన్న రోడ్లు జలమయ్యాయి. వర్షం రాకతో పట్టణంలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సౌకర్యానికి అంతరాయం కలిగింది. సాయంత్రం వర్షం పడటంతో ఉక్కపూతతో ఉన్న ప్రజలు చల్లగాలికి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.