కావలిలో గిరిజన మహిళపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి విడదల రజని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, ఎన్నికల సమయంలో మహిళలకు అండగా ఉంటామని చెప్పిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు నిందితులైన టీడీపీ నేతలను కాపాడుతున్నారని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న దాడులను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలే ప్రభుత్వానికి సమాధానం చెబుతారని ఆమె వ్యాఖ్యానించారు.