చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగారావుపాలెం, కోట, సంతపేట, చెంగిజ్ ఖాన్ పేట గ్రామాల్లో శనివారం ప్రత్తిపాటి రామకృష్ణం పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా, లింగారావుపాలెంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన మంచినీటి ప్లాంట్‌ను ప్రారంభించారు. రూ.13 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామస్థులతో మమేకమయ్యారు.